సీఎం జగన్‌ రేపటి ప్రచార షెడ్యూల్‌ ఇలా... | Cm Jagan Election Campaign Schedule For May 11 | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ రేపటి ప్రచార షెడ్యూల్‌ ఇలా...

May 10 2024 8:56 PM | Updated on May 10 2024 9:32 PM

Cm Jagan Election Campaign Schedule For May 11

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.  ఉదయం 10 గంటలకు  నరసరావుపేట  పార్లమెంట్  పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. 

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని  కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ  పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్‌స్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement