దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం.. అది జరిగితే..

CM Bhagwant Mann Will Set Target For Each Minister - Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా భగవంత్‌ మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 10 మంది ఎమ్మెల్యేలతో కేబినెట్‌ విస్తరణ చేశారు. ఈ క్రమంలోనే సీఎం మాన్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మంత్రి ఏర్పడిన రెండో రోజు పంజాబ్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలను నెలరోజుల్లో భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆదివారం ఆప్‌ సర్కార్‌ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సీఎం మాన్‌ తన మంత్రివర్గంలోని ప్రతీ మంత్రికి ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తారని చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరకపోతే సదరు మంత్రిని తొలగించాలని ప్రజలు డిమాండ్‌ వచ్చని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరూ ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా, అంకితభావంతో జట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులకు తగిన సూచనలు ఇవ్వడానికి తాను అందరికీ ఓ సోదరుడిలా ఉంటానని హామీ ఇచ్చారు.  

ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత ఉపసంహరణకు సంబంధించి మాన్‌ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్‌ ప్రశంసించారు. మరోవైపు.. ప్రజలపై ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించవద్దని సూచించారు. అలాగే, పంజాబ్‌లో అక్టోబర్‌లో నష్టపోయిన పంటలకు పరిహారం విడుదలైందని, రానున్న రోజుల్లో రైతులకు చెక్కులు అందజేస్తామన్నారు కేజ్రీవాల్‌.

ఇది చదవండి: ఈ పెళ్లి ప్రత్యేకం.. వరుడు చేత బాండ్‌ పేపర్‌పై సంతకం.. మాట తప్పితే తిప్పలే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top