‘ఎంపీ రవి కిషన్‌ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్‌ | Chief Minister Yogi Adityanath Funny Comments About Bjp Mp Ravi Kishan | Sakshi
Sakshi News home page

‘ఎంపీ రవి కిషన్‌ భూమిని కబ్జా చేశారు’, నవ్వులు పూయించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌

Mar 11 2024 3:17 PM | Updated on Mar 11 2024 3:52 PM

Chief Minister Yogi Adityanath Funny Comments About Bjp Mp Ravi Kishan - Sakshi

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ నవ్వులు పూయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్‌ స్థానం గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. 

ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్‌ ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ ఎంపీ రవికిషన్‌ ఉన్నారు. రవికిషన్‌ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. 

బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన 
‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్‌ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ  ప్రసంగాన్ని కొనసాగించారు. 

అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌
ఏడేళ్ల క్రితం రామ్‌గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్‌కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. 

గోరఖ్‌పూర్‌ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా
ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్‌ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్‌పూర్‌ ఎంపీ రవికిషన్‌ రెండోసారి పార్లమెంట్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్‌. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement