కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ వార్తా సంస్థ టీవీ, యాప్స్‌పై నిషేధం

Centre banned Punjab Politics TV - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్‌ పాలిటిక్స్‌ టీవీ’పై కేంద్ర ప్రభుత‍్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. 

సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్‌సైట్‌, యాప్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు Sikhs For Justice (SFJ)తో ఆ వార్తా సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. ఈ ఛానెల్‌ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top