
హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రాధాకృష్ణది కొత్త పలుకు కాదు.. చెత్త పలుకని పేర్కొన్న జగదీష్‌రెడ్డి.. సెటిలర్లు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నారన్న విషయం తెలుసుకోవాన్నారు. వారు చంద్రబాబును ఎప్పుడో తిరస్కరించారని, ఓ వర్గం పనిగట్టుకుని బీఆర్‌ఎస్ నేతలపై విషం కక్కుతుందన్నారు.
‘మీ రాతలతో కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్‌పై విషం వెళ్లగక్కారు. మీ రాతలు అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. మీతో పాటు, మీ గురువును జైలుకు పంపించే అవకాశం కేసీఆర్ ఏనాడో వచ్చింది. రాజకీయ కక్షల ఆలోచన వద్దని కేసీఆర్ వదిలేశారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.