రేవంత్‌ రహస్య మిత్రుడు బండి సంజయ్‌: బీఆర్‌ఎస్‌ | BRS Interesting Comments On Bandi Sanjay And Revanth | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రహస్య మిత్రుడు బండి సంజయ్‌: బీఆర్‌ఎస్‌

Oct 20 2024 8:01 AM | Updated on Oct 20 2024 8:01 AM

BRS Interesting Comments On Bandi Sanjay And Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్‌, పోలీసులకు సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్‌ షేర్‌ చేసింది.

బీఆర్‌ఎస్‌ ట్విట్టర్‌ వేదికగా..‘నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్‌కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్’ అంటూ వీడియోను షేర్‌ చేసింది.

అంతకుముందు బీఆర్‌ఎస్‌ నేతలు నిరుద్యోగులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆ పార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ కూడా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement