కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధం: లక్ష్మణ్‌

BJP K Laxman Fires On KCR Over Flood Relief Package From Cente - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. వరద బాధితులకు నిధులు మంజూరు చేసిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధమన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి సముద్రం లేదన్న కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. నగర రోడ్లు బాగుపడే వరకు టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు. విశ్వనగరాన్ని మురికి నగరంగా మార్చారు. కేటీఆర్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు.. వర్రియింగ్ ప్రెసిడెంట్. తండ్రి కొడుకులిద్దరూ కలిసి దోచుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మిలాఖత్ అయ్యి హైదరాబాద్‌ని నాశనం పట్టించారు. తెలంగాణ రాష్ట్రన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటున్నది. వివిధ రంగాల్లోక నిధులు కేటాయించింది. వరద బాధితులకు కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది’ అని తెలిపారు. (చదవండి: జనంలో తక్కువ.. సోషల్‌ మీడియాలో ఎక్కువ)

‘వర్షాలు పడి అన్ని కోల్పోయిన వారిని కనీసం పట్టించుకోని.. పరామర్శించని ఏకైకా ముఖ్యమంత్రి కేసీఆర్. అకాల వర్షాలు పడితే ఫామ్ హౌస్‌లో పడుకున్నావు. కేసీఆర్‌ అంటే ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి. మజ్లీస్ పార్టీ వరద సహాయ నిధులలో అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ పార్టీకి బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. మీ ఇంట్లో మాత్రం అందరికి ఉద్యగాలు ఇచ్చావ్‌. పరీక్షలో ఫెయిల్‌ అయిన కవితకు ఉద్యోగం కల్పించావ్‌. ప్రస్తుతం నీ మనవడు హిమాన్ష్‌ మాత్రమే ఖాళీగా ఉన్నాడు’ అంటూ లక్ష్మణ్‌ తీవ్రంగా మండి పడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top