ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్‌

BJP Bandi Sanjay Laxman Reaction On YT Raids In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను దోచుకొని అడ్డంగా ఆస్తులు సంపాదిస్తే సోదాలు చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు వస్తే ఆధారాలతో వాటిపై స్పందించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ, అధికారులపై ఉంటుందని తెలిపారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని.. ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

మేము సిద్ధం: లక్ష్మణ్‌
ఐటీ దాడులు కొత్త కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్‌ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురు పేర్లను అడ్డంగా పెట్టుకొని కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని  విమర్శించారు.

‘ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అక్రమ సంపాదించిన వారు, పన్ను ఎగవేతదారులపై దాడి చేసి లెక్కలు బయటకు తీయడమే ఐటీ సంస్థల పని అన్నారు. ఏమి తప్పు చేయనివారు ఎందుకు భయపడటం?. ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు వెలుగులోకి వస్తుంటే వాటికి లెక్కలు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ రాజకీయ విమర్శలతో తప్పించుకోవాలని చూడటం సరికాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది’ అని లక్ష్మణ్‌ చెప్పారు.
చదవండి: లిక్కర్‌ స్కామ్‌లో ల్యాప్‌టాప్‌ నివేదిక కీలకం.. మరో వారం కస్టడీ కోరిన ఈడీ

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top