ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు.. వీళ్లే తెలంగాణను ఏలుతున్నారు.. బండి ఫైర్‌

Bandi Sanjay Slams KTR Over TSPSC Paper Leak Sangareddy BJP Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దవడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ వివరణ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నడ్డా గారు రాలేక పోయారని, మరోసారి వస్తానని చెప్పారని తెలిపారు. జేపీ నడ్డా, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోనే బీజేపీ అతి శక్తి వంతమైన పార్టీగా అవతరించిందని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలి. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. ఇక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ సర్కార్‌ నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిల్స్ చేస్తున్నారు. కేసీఆర్ కొడుకు, ట్విటర్ టిల్లును ఉరికించి కొడుతారు. మోదీని బ్రోకర్ అంటవా..! నువ్వు బ్రోకర్, నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మునుగొడులో పోలింగ్ ఏజెంట్లు దొరకని పార్టీ బీఆర్‌ఎస్‌.

టీఎస్‌పీఎస్సీ నిర్వాకం వల్ల 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే మీ అయ్యా ఎందుకు మాట్లాడలేదు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి. నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ విచారణతో జరిపించాలి.  నా పైన పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు, అగ్గిపెట్టే రావు వీళ్లే తెలంగాణను ఏలుతున్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తాం. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.
(చదవండి: Tspsc Paper Leak: రేవంత్‌ ఆరోపణలపై సిట్‌ రియాక్షన్‌)

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top