చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి | Association of Police Officers Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Oct 24 2021 5:04 AM | Updated on Oct 24 2021 5:04 AM

Association of Police Officers Comments On Chandrababu - Sakshi

మాట్లాడుతున్న శ్రీనివాసరావు, తదితరులు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. డీజీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను ఆసరాగా తీసుకుని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు.  

డీజీపీ రాసిన ఉత్తరాలను లవ్‌ లెటర్స్‌ అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చంద్రబాబు చెప్పాలన్నారు. పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత అజెండా అమలు చేయడానికి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement