వైఎస్‌ జగన్‌పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు | Gorantla Butchaiah Chowdary Shocking Comments On YS Jagan AP Rappa Rappa Poster Controversy, News Video Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు

Jun 20 2025 1:57 PM | Updated on Jun 20 2025 3:11 PM

AP Rappa Rappa Politics: Gorantla Butchaiah Chowdary Comments On YS Jagan

సాక్షి, విజయవాడ: ఏపీని రప్పా రప్పా రాజకీయం ఊపేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా? నీ తల నరకొచ్చు కదా.. అంటూ జగన్‌ను ఉద్దేశించి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయారాయన. 

ఇటీవలె ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు ఊగిపోయారు. ఇప్పుడు బాబు బాటలోనే బుచ్చయ్యచౌదరి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నిన్న ఏం అంటావు నువ్వు .... గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టే నరుకుతామని అంటే ..దానిలో తప్పు ఏముందని అంటున్నావు .. నేను అంటున్నా .. నీతల నరకొచ్చుగా!
::ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంలో.. ఓ యువకుడు పుష్ప2 చిత్రంలోనే ఫేమస్‌ డైలాగ్‌తో వైఎస్‌ జగన్‌ ఫొటోను ఫ్లెక్సీగా ప్రదర్శించారు. అయితే అందులో డైలాగ్‌ అభ్యంతకరంగా ఉందంటూ పోలీసులు అతనిపై కేసు పెట్టారు. గురువారం వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలో కొందరు పాత్రికేయులు ఈ విషయాన్ని జగన్‌ వద్ద ప్రస్తావించారు.

అయితే ఆ ఫ్లెక్సీలో ఉన్న డైలాగును స్వయంగా విలేకరుల నోటి నుంచే జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అంతేతప్ప .. ఆయన స్వయంగా ఏం ఆ డైలాగ్‌ను కొట్టలేదు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు, మేనరిజాలను పాటించే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ చంద్రబాబును నిలదీశారు. అంతేకాదు.. ఆ పోస్టర్‌ ప్రదర్శించింది స్వయానా టీడీపీ అభిమానినే అని ఆధారాలు సైతం ప్రదర్శించారాయన.

అయితే జగన్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను టీడీపీ ఘోరంగా వక్రీకరించింది. జగన్‌ నోటి నుంచి రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్‌ వచ్చిందంటూ గగ్గోలు పెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల.. మరికొందరు నేతలు వరుసగా ప్రెస్‌మీట్‌లు పెడుతూ నరుకుడు డైలాగ్‌ కొట్టారంటూ జగన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. ఐటీడీపీ అండ్‌ కో తమ ఎడిటింగ్‌లకు పని చెప్పి సోషల్‌ మీడియాలోనూ జగన్‌ అనని ఆ డైలాగ్‌ను ఆపాదిస్తూ విషప్రచారాన్ని ఉధృతం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement