‘అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకుని డైవర్ట్‌ పాలిటిక్స్‌’ | AP Minister Adimulapu Suresh Comments On Kotamreddy | Sakshi
Sakshi News home page

‘అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకుని డైవర్ట్‌ పాలిటిక్స్‌’

Feb 4 2023 4:31 PM | Updated on Feb 4 2023 4:37 PM

AP Minister Adimulapu Suresh Comments On Kotamreddy - Sakshi

ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మాచర్లలో రూ.480 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

సాక్షి, పల్నాడు జిల్లా: ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మాచర్లలో రూ.480 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడుతూ, ‘‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును కలవలేదా?. కోటంరెడ్డి అడ్డంగా దొరికిపోయి ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నాడు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అతను చూపించే విశ్వాసం ఇదేనా?’’ అంటూ దుయ్యబట్టారు.

లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్: ఎమ్మెల్యే పిన్నెల్లి
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయింది. అందుకే చంద్రబాబు.. శ్రీధర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. శ్రీధర్ రెడ్డి దమ్ముంటే 51 సెకండ్ల ఆడియోను బయట పెట్టాలి. చంద్రబాబుతో కుమ్మక్కై అడ్డంగా దొరికిపోయి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ఇలా ఎంతమంది పోయిన పార్టీకి నష్టం లేదు. పార్టీలో ఇలాంటి కోవర్టులు ఉంటే సీఎం జగన్‌ కచ్చితంగా బయటికి పంపుతారు’’ అని పిన్నెల్లి అన్నారు.
చదవండి: కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement