‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్‌ ఒక్కడే’ | Sakshi
Sakshi News home page

‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్‌ ఒక్కడే’

Published Mon, Jan 8 2024 6:32 PM

Ap Deputy Cm Narayana Swamy Comments At Budvel Ysrcp Bus Yatra - Sakshi

సాక్షి, బద్వేల్‌: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో సోమవారం జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్‌ కోసం పనిచేసే కూలీ అని అన్నారు.

‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్‌ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. 

ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్‌ పరుగులు 

Advertisement
 
Advertisement
 
Advertisement