‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్‌ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్‌ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Published Mon, Mar 25 2024 5:06 PM

Anurag Thakur Slams Kejriwal Prison Governance as Rabri 2 0  Strategy - Sakshi

లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ అ‍న్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. 

జైలు నుంచి కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు.

Advertisement
Advertisement