
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. సైకో బ్యాచ్, సైకిల్ బ్యాచ్ సత్తెనపల్లిని నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి అంబటి రాంబాబు గురువారం జరిగిన వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. కిరాయి రౌడీల్లాగా, కిరాయి పాలిటిక్స్ చేసే పార్టీ జనసేన పార్టీ. గతంలో తాడేపల్లి ఆఫీసులో పవన్ కల్యాణ్.. కాపులను కించపరుస్తూ మాట్లాడాడు. నాకు, కాపులకు మధ్య తగాదాలు పెట్టాలని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. అలా సినిమా డైలాగ్స్ కొడుతూ, ఓవర్‌గా మాట్లాడే వ్యక్తి ఏపీ రాజకీయాల్లో పనికొస్తాడా?. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నాగాబాబు కూడా నన్ను ఏమీ చేయలేరు. నన్ను గెలిపించిన సత్తెనపల్లి ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని అన్నారు.