ఎస్‌ఈసీతో ముగిసిన రాజకీయ పార్టీల భేటీ

All Party Leaders Meeting With SEC Nimmagadda Ramesh Kumar - Sakshi

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ)తో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీ ముగిసింది. మొత్తం 19 పార్టీలకు గాను 11 పార్టీలు హాజరయ్యాయి. ఇక ఎస్‌ఈసీ సమావేశానికి వైఎస్సార్‌సీపీ హాజరు కాలేదు. ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం కుదరదని పార్టీలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. టీడీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించాయి. 

ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘గతంలో కరోనా లేకపోయినా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సమావేశాలు పెట్టడం సరికాదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమావేశాల నిర్వహణతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుంది. ప్రైవేట్ హోటల్‌లో బీజేపీ-టీడీపీ నేతలను కలిసినప్పుడే నమ్మకం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు’ అని తెలిపారు. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుపై విస్మయం)

నవతరం పార్టీ నేతల అరెస్ట్‌
ఇక ఈసీ సమావేశానికి ఆహ్వానించక పోవడంపై నవతరం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డకు వినతిపత్రం ఇచ్చేందుకు నవతరం పార్టీ నేతలు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని, ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top