అమిత్‌ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి దిమ్మతిరిగే షాక్‌

Akhilesh Yadav questions Bjp To Jay Shah As BCCI Secretary - Sakshi

బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.

తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై  ఆ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. గురువారం ఆయన ఎన్‌డీ టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు.  ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్‌ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్‌ పేర్కొన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు. ఎస్‌పీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అయిన ములాయం సింగ్‌ యాదవ్‌ కొడుకు అఖిలేశ్‌ అన్న విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top