ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌కు బిగ్‌ షాక్‌ | MIM MLC Mirza Rahmath Baig Expelled From Party Over Leaked Video Controversy, Watch News Video For Details | Sakshi
Sakshi News home page

ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌కు బిగ్‌ షాక్‌

Aug 29 2026 7:14 AM | Updated on Aug 29 2026 12:07 PM

Aimim Expels Mlc Mirza Rahmath Baig From Party

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌  బేగ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌  బేగ్‌పై ఎంఐఎం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎంఐఎం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి మీర్జా బేగ్‌ రాజీనామా చేయాలని ఆదేశించింది. ఓ వీడియో లీక్‌ వ్యవహారంలో రహ్మత్‌బేగ్‌పై చర్యలు తీసుకుంది.

ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు 'ఎక్స్' ద్వారా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎ హుస్సేన్ అన్వర్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్ పై పలువురు ఫిర్యాదు చేశారని, అతని వ్యవ హారశైలి పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు.

దీంతో పార్టీ అధినేత సూచనను మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలని, ఆ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేయాలని పేర్కొన్నారు.

 

ఇదీ చదవండి: జిమ్‌ ట్రైనర్‌ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement