breaking news
Mirza Ahmad Beg
-
మీర్జా రహ్మత్ బేగ్ పై MIM వేటు
-
ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎంఐఎం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి మీర్జా బేగ్ రాజీనామా చేయాలని ఆదేశించింది. ఓ వీడియో లీక్ వ్యవహారంలో రహ్మత్బేగ్పై చర్యలు తీసుకుంది.ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు 'ఎక్స్' ద్వారా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎ హుస్సేన్ అన్వర్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ పై పలువురు ఫిర్యాదు చేశారని, అతని వ్యవ హారశైలి పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు.దీంతో పార్టీ అధినేత సూచనను మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలని, ఆ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేయాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
ఆత్మ‘హత్య’?
చెట్టుకు ఉరేసుకొని బాలుడి మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు యాకుత్‌పురా: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండటం బట్టి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం భవానీనగర్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా రజానగర్ ప్రాంతానికి చెందిన మీర్జా మహ్మద్ బేగ్ కుమారుడు మీర్జా అహ్మద్ బేగ్ (14) ఈదిబజార్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన అహ్మద్ బేగ్ అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయం మహమ్మద్‌నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు అహ్మద్‌బేగ్ ఉరేసుకొని మృతి చెంది ఉండగా స్థానికులు భవానీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెట్టు పై నుంచి కిందికి దించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఒంటిపై ప్యాంట్ తొలగించబడి చొక్కా మాత్రమే ఉంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి బోరుమన్నారు. పోలీసులు మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మీర్జా మహ్మద్ బేగ్‌కు మృతుడు అహ్మద్ బేగ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలుడు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎవరితో గొడవ పడలేదని... ప్రతి రోజు మాదిరిగానే బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటం, ఒంటిపై గాయాలు లేకపోవడం, ప్యాంట్ తొలగించబడటం వంటి కారణాల నేపథ్యంలో పోలీసులు అహ్మద్ బేగ్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్యా, ఆత్మహత్య అనేది తెలుస్తుందని ఎస్సై శ్రీశైలం తెలిపారు.


