Komatireddy Rajgopal Reddy: ‘టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా పోలేదు’

After My Resignation Munugode gets Development Rajgopal Reddy - Sakshi

నల్గొండ: మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన రాజీనామా అనంతరం మునుగోడులో ఎన్నో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజీనామా చేస్తే, బీజేపీకి అమ్ముడుపోయానంటూ తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. చుండూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. 

‘చౌటుప్పల్, నారాయణ పురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారు. రాత్రికి రాత్రి ఆటోల్లో పిరికిపందల్లా వచ్చి అతికించిపోయారు. రాజగోపాల్ అమ్ముడు పోయారంటూ అందులో ఉంది.నేనంటే గిట్టనివాళ్లే చేస్తున్నారు. 12 మంది‌ ఎమ్మెల్యేలు పోయిన నాడే పార్టీ మారేవాడిని. భూ నిర్వాసితులకు న్యాయం చేయమని, రోడ్లు నిర్మించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బెల్ట్ షాపులు తొలగించాలని, చౌటుప్పల్ లో‌ కాలుష్యం పై పోరాటం చేస్తూనే ఉన్నా. తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో అవినీతిపై పోరాటం చేశా. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తాడా?, ఒక పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన వ్యక్తులను పట్టించుకోలేదు. 

అవినీతి, కుటుంబ పాలన‌పోవాలనే పార్టీ మారుతున్నా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన‌పడింది. గట్టుప్పల‌ మూడున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. అమిత్ షాని కలవగానే మండలం‌ ఇవ్వలేదా?, నా రాజీనామాతో తెలంగాణా వ్యాప్తంగా పది లక్షల పించన్లు రాలేదా?, నా రాజీనామా వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి. సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని చెప్పిన. మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారనే ఇలాంటి పని చేస్తున్నారు.నాకు వస్తున్న ఆదరణ చూసే ఇలాంటి పనులు చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా పోలేదు. అలాంటిది ఇప్పుడు కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతానా?, నిజాయితీగా నైతిక విలువలకు కట్టుబడి బీజేపీలో‌ చేరుతున్నా’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top