1999 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ | Sakshi
Sakshi News home page

1999 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Fri, Mar 8 2024 4:23 PM

1999 Andhra Pradesh Caste Equations - Sakshi

1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తిరిగి అదికారంలోకి వచ్చింది. బీజేపీ పొత్తుతో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్ర ప్రాంతంలో 130 నియోజకవర్గాలలో గెలుపు సాధించింది.ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ కు నలభై తొమ్మిది సీట్లు రాగా, బీజేపీ కి నాలుగు దక్కాయి. ఇండిపెండెంట్లు నలుగురు నెగ్గారు. సామాజికవర్గాల విశ్లేషణ చూస్తే రెడ్డి సామాజికవర్గం వారు 44 మంది గెలవగా,వారిలో తెలుగుదేశం పక్షాన 21 మంది, కాంగ్రెస్‌ పార్టీ తరపున 23 మంది  నెగ్గారు. కమ్మ సామాజికవర్గం వారు నలభై మంది గెలవగా, టీడీపీ నుంచి 34 మంది, కాంగ్రెస్‌ నుంచి నలుగురు, బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్‌ ఒకరు ఉన్నారు.

కాపు సామాజికవర్గం వారు 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో టీడీపీపద్నాలుగు మంది, ఆరుగురు కాంగ్రెస్‌ వారు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీసీలు ముప్పై నాలుగు మందికిగాను టీడీపీ24, కాంగ్రెస్‌ నుంచి  పది మంది గెలిచారు. ఎస్‌.సిలు ఇరవై రెండు మందికి గాను పదహారు మంది టీడీపీ, నలుగురు కాంగ్రెస్‌, ఒకరు బీజేపీ,ఒకరు ఇండిపెండెంట్‌ ఉన్నారు.క్షత్రియలు ఎనిమిది మంది గెలిస్తే, ఏడుగురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్‌ వారు ఉన్నారు.ఎస్‌.టిలు ఎనిమిది మందికిగాను  ఏగుగురు  తెలుగుదేశం వారే. ఒకరు కాంగ్రెస్‌ నుంచి నెగ్గారు. కాగా ముస్లింలు ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్‌ నుంచి నెగ్గారు. ఇతరులు నలుగురు టీడీపీవారే.

 • బీసీ వర్గాల విశ్లేషణ- కొప్పుల వెలమ-7
 • యాదవ- 5
 • తూర్పు కాపు-4
 • గౌడ-4
 • మత్సకార-3
 • పొలినాటి వెలమ-3
 • కాళింగ- 2
 • గవర- 2
 • పద్మశాలి-2
 • శెట్టి బలిజ-1

రెడ్డి ఎమ్మెల్యేల విశ్లేషణ-44
1999లో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చినా , రెడ్లు  కాంగ్రెస్‌ పార్టీ తరపున కొద్దిగా ఎక్కువగా  గెలవడం విశేషం.టీడీపీపక్షాన 21 మంది రెడ్లు గెలిస్తే, 23 మంది రెడ్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కోస్తాలో ఎనిమిది మంది కాంగ్రెస్‌ పక్షాన, ఎనిమిది మంది టీడీపీనుంచి గెలిచారు. రాయలసీమ నుంచి పదిహేను మంది కాంగ్రెస్‌ పక్షాన రెడ్లు ఎన్నిక కాగా, టీడీపీతరపున పదమూడు మంది గెలిచారు.

తెలుగుదేశం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు.. 21

 • ఎన్‌. మూలారెడ్డి - అనపర్తి,
 • జె. దుర్గాంబ-మాచర్ల
 • పి. విజయ్‌ కుమార్‌ రెడ్డి-గిద్దలూరు
 • వి. వేణుగోపాలరెడ్డి-కావలి, ఎన్‌.ప్రసన్నకుమార్‌ రెడ్డి- కోవూరు, ఎస్‌.చంద్రమోహన్‌ రెడ్డి-సర్వేపల్లి, ఎ.ప్రభాకరరెడ్డి-అల్లూరు, కె.విజయరామిరెడ్డి- ఉదయగిరి, కె.వీరారెడ్డి- బద్వేల్‌, ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, పి.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు,ఎస్‌.రఘురామిరెడ్డి- మైదుకూరు, బి.శోబా నాగిరెడ్డి- ఆళ్లగడ్డ, బి.సీతారామిరెడ్డి-ఆత్మకూరు, బి.రాజశేఖరరెడ్డి-నందికోట్కూరు, బి.పార్ధసారధిరెడ్డి- పాణ్యం, ఎస్‌.వి.సుబ్బారెడ్డి- ప్రత్తికొండ, బివి మోహన్‌ రెడ్డి- ఎమ్మిగనూరు, పి.రఘునాదరెడ్డి-నల్లమడ, బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి, ఆర్‌.రాజశేఖరరెడ్డి- పుత్తూరు.

ఉప ఎన్నిక..

 • గిద్దలూరు - సాయికల్పన రెడ్డి - టీడీపీ

కాంగ్రెస్‌ రెడ్డి ఎమ్మెల్యేలు- 23

 • గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల
 • కె. నాగార్జునరెడ్డి-కంభం
 • ఎస్‌. పిచ్చిరెడ్డి-దర్శి
 • బి. శ్రీనివాసరెడ్డి- ఒంగోలు, కె.పి. కొండారెడ్డి- మార్కాపురం, ఆనం వివేకానందరెడ్డి- నెల్లూరు, ఆనం రామనారాయణరెడ్డి- రాపూరు, ఎన్‌.రాజ్యలక్ష్మి- వెంకటగిరి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి-పులివెందుల, ఎమ్‌.వి. మైసూరారెడ్డి- కమలాపురం, ఎన్‌.వరదరాజులు రెడ్డి -ప్రొద్దుటూరు, చల్లా రామకృష్ణారెడ్డి- కోయిలకుంట్ల, వి.వేణుగోపాలరెడ్డి- రాయదుర్గం, వై.శివరామిరెడ్డి- ఉరవకొండ, జెసి దివాకరరెడ్డి- తాడిపత్రి, బి.నారాయణరెడ్డి- అనంతపురం, కె.సూర్యప్రతాపరెడ్డి- ధర్మవరం, కె.ప్రభాకరరెడ్డి- తంబళ్లపల్లె, పి.రామచం్షరెడ్డి-పీలేరు, ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి- వాయల్పాడు, ఎన్‌.శ్రీధర్‌ రెడ్డి-పుంగనూరు, ఆర.చెంగారెడ్డి-నగరి, సి.కె.జయచంద్రారెడ్డి-చిత్తూరు.

కమ్మ సామాజికవర్గం విశ్లేషణ- 40
కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఎన్నిక కాగా, వారిలో ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్‌ నుంచి విజయం సాదించారు. ఒకరు బీజేపీ నుంచి గెలవగా ,మరొకరు ఇండిపెండెంటుగా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారిలో ఇరవై తొమ్మిది మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, ఐదుగురు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచివనారిలో ముగ్గురు కోస్తా నుంచి ఒకరు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ, ఇండిపెండెట్లు కూడా కోస్తా జిల్లాలవారే.

తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-34

 • ఎమ్‌.వి. కృష్ణారావు-ఇచ్చాపురం
 • గద్దె బాబూరావు-చీపురుపల్లి
 • బి. భాస్కర రామారావు-పెద్దాపురం
 • వివిఎస్‌ చౌదరి-ఆలమూరు, కె.అచ్చమాంబ-బూరు గుపూడి, జి.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి, వై.టి .రాజా- తణుకు, కె.విశ్వనాధం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, డి.బాలవర్దనరావు- గన్నవరం, రావి హరగోపాల్‌-గుడివాడ, అన్నె బాబూరావు- ఉయ్యూరు, వై. నాగేశ్వరరావు- కంకిపాడు, వడ్డే శోభ నాద్రీశ్వరరావు-మైలవరం, డి.ఉమా మహేశ్వరరావు-నందిగామ, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్ర ప్రసాద్‌- వేమూరు, ఎమ్‌.వెంక టసుబ్బయ్య- రేపల్లె, గోగినేని ఉమ- తెనాలి, ఎమ్‌.పెద రత్తయ్య- ప్రత్తి పాడు, పి. పుల్లారావు-చిలకలూరిపేట, కె.శివ ప్రసాదరావు-నరసరావుపేట, వై.వీరాంజనేయులు- సత్తెనపల్లి, వి.యల్లమందారావు-వినుకొండ, జె.లక్ష్మీ పద్మావతి -పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, జి.నరసయ్య-మా ర్టూరు, దివి శివరామ్‌-కందు కూరు, డి.ఆంజనేయులు-కొండపి, కె.మీనాక్షి నాయుడు- ఆదోని, సిసి వెంకట్రా ముడు-హిందూపూర్‌, పి.రవీంద్ర-పెనుకొండ, ఆర్‌.శోభ-మదన పల్లె, చంద్రబాబు నాయుడు-కుప్పం.

కాంగ్రెస్‌ కమ్మ ఎమ్మెల్యేలు-4

 • పి. వెంకటేశ్వరరావు-ముదినేపల్లి
 • ఇ. తిరుపతి నాయుడు-కనిగిరి
 • బి. కృష్ణయ్య- ఆత్మకూరు(నెల్లూరు జిల్లా)
 • జి. అరుణకుమారి- చంద్రగిరి.

ఇతర కమ్మ ఎమ్మెల్యేలు..

 • కె.హరిబాబు- విశాఖపట్నం ఒకటి -బీజేపీ
 • వై.రాజా రామచందర్‌- కైకలూరు- ఇండి

కాపు ఎమ్మల్యేలు-22
1999లో ఇరవై రెండు మంది కాపు నేతలు ఎమ్మెల్యేలుగా గెలవగా, వారిలో టీడీపీనుంచి పద్నాలుగు, ఆరుగురు కాంగ్రెస్‌, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. టీడీపీనుంచి గెలిచినవారిలో ముగ్గురు తప్ప మిగిలినవారంతా కోస్తాజిల్లాలవారే. కాంగ్రెస్‌ లో గెలిచినవారంతా కోస్తావారే.
టీడీపీకాపు ఎమ్మెల్యేలు.. 14

 • పి. చలపతిరావు-యలమంచిలి
 • పర్వత బాపనమ్మ-ప్రత్తిపాడు
 • సి. రామచంద్రరావు-తాళ్లరేవు
 • తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, జెవి అప్పారావు(నెహ్రూ)- జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, ఎర్రా నారాయణ స్వామి- తాడేపల్లిగూడెం, ఎస్‌.అరుణ-గుంటూరు-2, పి.బ్రహ్మయ్య-రాజంపేట, (బలిజ) ఎస్‌.పాలకొండ్రాయుడు-రాయచోటి,(బలిజ) చదలవాడ కృష్ణమూర్తి-తిరుపతి(బలిజ)

కాంగ్రెస్‌ కాపు ఎమ్మెల్యేలు-6

 • బలిరెడ్డి సత్యారావు-చోడవరం
 • జక్కంపూడి రామ్మోహన్‌ రావు-కడియం
 • జి.ఎస్‌.రావు -కొవ్వూరు
 • మండలి బుద్దప్రసాద్‌-అవనిగడ్డ
 • ఎస్‌.ఉదయభాను-జగ్గయ్యపేట
 • కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు

ఇండిపెండెంట్‌  కాపు ఎమ్మెల్యేలు.. 2

 • ఎస్‌.వీరభద్రరావు-పిఠాపురం-ఇండి
 • కె.వి.రాఘవేంద్రరావు-పెనుగొండ-ఇండి

బీసీ ఎమ్మెల్యేలు- 33
 1999 ఎన్నికలలో బీసీ ఎమ్మెల్యేలు మొత్తం ముప్పైనాలుగు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీవారు ఇరవైనాలుగు మంది, కాంగ్రెస్‌ వారు పది మంది. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలలో పదిహను మంది ఉత్తరాంద్ర నుంచి గెలుపొందడం విశేషం.ఐదుగురు మిగిలిన కోస్తా జిల్లాలవారు కాగా,నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ పక్షాన గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాల వారు(ఆరుగురు ఉత్తరాంద్ర నుంచి ),ఒకరు రాయలసీమకు చెందినవారు. బీసీలలో ఒక్కో కులం వారీగా చూస్తే ఏడుగురు కొప్పుల వెలమ,ఐదుగురు యాదవ, నలుగురు గౌడ, తూర్పు కాపు నలుగురు,పొలినాటి వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, గవర ఇద్దరు, కాళింగ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు , శెట్టి బలిజ ఒకరుగెలుపొందారు.

తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 24

 • గైతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ
 • కె. రేవతిపతి-టెక్కలి-కాళింగ
 • కె. మోహన్‌రావు- పాతపట్నం-తూర్పుకాపు,జి.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం- పి.వెలమ, తమ్మినేని సీతారామ్‌ -ఆముదాల వలస-కాళింగ, కె.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పి.వెలమ, కె.గణపతిరావు- ఉణుకూరు- తూర్పుకాపు, కె.అప్పల నాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ, పి.నారాయణస్వామి నాయుడు- భోగాపురం- తూర్పుకాపు, పిన్నింటి వరలక్ష్మి-విశాఖ2, -యాదవ, బి.సత్య నారాయ ణమూర్తి-పరవాడ, -కె.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కొప్పుల వెలమ, దాడి వరభధ్రరావు -అనకాపల్లి-గవర, పి.గణబాబు-పెందుర్తి-గవర, అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు- తుని-యాదవ, వి.వెంకటేశ్వరరావు -కాకినాడ-మత్సకార, పి.అనంతలక్ష్మి- తాళ్లరేవు-శెట్టిబలిజ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం- గౌడ, ఎన్‌.నరసింహరావు-మచిలీ పట్నం-మత్స కార, పి.రామారావు-చీరాల-యాదవ,కె.ఇ.ప్రభాకర్‌-ఢోన్‌-గౌడ, ఆర్‌.సాయినాద్‌ గౌడ్‌-గుత్తి, -గౌడ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి

కాంగ్రెస్‌ బీసీ ఎమ్మెల్యేలు-9

 • ధర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పి.వెలమ
 • ఎమ్‌. శివున్నాయుడు-పార్వతి పురం-కె.వెలమ
 • పి.జగన్మోహన్‌ రావు-బొబ్బిలి-కె.వెలమ
 • వాసిరెడ్డి వరద రామారావు-తెర్లాం -కె.వెలమ
 • టిఎస్‌ఎ నాయుడు- గజపతినగరం-తూర్పుకాపు
 • ఎమ్‌. హను మంతరావు-మంగళగిరి-పద్మశాలి
 • ఎమ్‌.వెంకటరమణ-కూచినపూడి-మత్యకార
 • జె.కృష్ణమూర్తి- గురజాల-యాదవ
 • ఎన్‌.రఘువీరారెడ్డి-మడకశిర-యాదవ.

టీడీపీక్షత్రియ ఎమ్మెల్యేలు..7

 • పి.అశోక్‌ గజపతిరాజు-విజయనగరం
 • ఆర్‌ఎస్‌ డిపి నరసింహరాజు-భీమిలి
 • ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు
 • డి. శివరామరాజు-అత్తిలి
 • పివి. నరసింహరాజు-భీమవరం
 • కె.రామచంద్రరాజు-ఉండి
 • మంతెన అనంతవర్మ-బాపట్ల

కాంగ్రెస్‌ క్షత్రియ ఎమ్మెల్యే-1

 • పి.సాంబశివరాజు- సతివాడ

ముస్లిం ఎమ్మెల్యేలు..
నలుగురు ఎన్నిక కాగా వారిలో ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్‌ కు చెందినవారు.
టీడీపీ..3 ఎస్‌.జియావుద్దీన్‌-గుంటూరు-1, ఖలీల్‌ భాషా-కడప, ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌-నంద్యాల
కాంగ్రెస్‌-1 జలీల్‌ ఖాన్‌-విజయవాడ 1

ఇతర సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు..6 (నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ)
వైశ్యులు ముగ్గురు, ఇద్దరు వెలమ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందనవారు గెలిచారు.

వైశ్య-3

 • అంబికా కృష్ణ-ఏలూరు-టీడీపీ
 • టిజి వెంకటేష్‌- కర్నూలు-టీడీపీ
 • ఎమ్‌.ఎస్‌. పార్ధసారది-కదిరి-బీజేపీ

వెలమ-2

 • కె. విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ
 • కె. హనుమతరావు-నూజివీడు-టీడీపీ.

బ్రాహ్మణ
కోట శ్రీనివాసరావు-విజయవాడ తూర్పు-బీజేపీ


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement