ధర్మారం: స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాలు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలును, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని డీఈవో శారద అన్నారు. మండలంలోని దొంగతుర్తి పాఠశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె, మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాలతో ఉపాధ్యాయ వృత్తిపై గౌరవం పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న బోధనా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయన్నారు. రచ్చపల్లి పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంబించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో వందశాతం సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఎంఈవో ప్రభాకర్, సర్పంచు సూర రజిత, హెచ్‌ఎంలు సముద్రాల వంశీమోహనాచార్యులు, శ్రీనివాస్‌రావు, ఉపాధ్యాయులు సమ్మయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వేకు అందుబాటులో ఉండాలి
జూలపల్లి: భూముల రీ సర్వేకు రైతులు అందుబాటులో ఉండి సహకరించాలని పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య సూచించారు. గురువారం మండలంలోని కాచాపూర్‌లో భూముల రీ సర్వేను తహసీల్దారు ప్రసాదరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు, గ్రామస్తుల సమన్వయంతో సర్వేను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాయబ్ తహసీల్దారు అనిల్‌కుమార్, గిర్ధావర్ మల్లికార్జునరావు, జీపీవో రజిత, సిబ్బంది పాల్గొన్నారు.
రీ సర్వే పరిశీలన
ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్ గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను గురువారం పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎలిగేడులోని తహసీల్దార్ కార్యాలయంలో రీ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కేసీఆర్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
మంథని: తెలంగాణ సాధనకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాల స్ఫూర్తిని నేటి యువతరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నిర్వహించే దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. గురువారం మంథని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం పుట్ట మధు మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. దీక్షాదివస్‌కు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


