ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

గోదావరిఖని/పెద్దపల్లిరూరల్‌: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి అన్నా రు. గురువారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక గాంధీనగర్‌లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రామగుండం కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలు వ లింగస్వామి, బొంతల రాజేశ్‌, మదరబోయిన రవికుమార్‌, దీటి బాలరాజు, గట్ల రమేశ్‌, దూళికట్ట సతీశ్‌, ఫజల్‌, తిప్పారపు శ్రీనివాస్‌, కలవల రంజి త్‌, దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, బొమ్మక రాజేశ్‌, కంకణాల రాజు, సన్నీ పాల్గొన్నారు.

బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడుతూ గరీభీ హఠావో నినాదంతో ముందుకు సాగిన మాజీ ప్రధాని ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బూతగడ్డ సంపత్‌ అన్నారు. పెద్దపల్లిలోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విండో చైర్మన్‌ ముత్యాల నరేశ్‌, కౌన్సిలర్లు సరస్వతి, ఈర్ల స్వరూప, కొమ్ము సుధాకర్‌, జగదీశ్‌, శ్రీకాంత్‌, గుజ్జుల కుమార్‌, రమాదేవి, మందల సత్యనారాయణరెడ్డి, పూరెల్ల సుధాకర్‌, రాజేందర్‌, షంషేర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement