● శ్రీసాయి సూపర్ మార్కెట్‌పై కేసు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గల శ్రీసాయి సూపర్ మార్కెట్‌పై గురువారం కేసు నమోదు చేశారు. జిల్లా పౌర సరఫరాలు, తూనికలు, కొలతల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయగా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారని తేలింది. దీంతో సూపర్ మార్కెట్‌పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా అదేప్రాంతంలోని ఏజీ మార్ట్‌లోనూ తనిఖీలు చేపట్టి విక్రయ ధరలు పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకం రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకం రూ.79 చొప్పున విక్రయించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరలకే బియ్యం విక్రయించాలని, అంతకుమించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రఘువీర్‌సింగ్, డిటీప్యూట తహసీల్దార్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
కాలేజీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
కరీంనగర్‌క్రైం: కాలేజీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. త్రీ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన రంగుల వినయ్ (21) గురువారం సాయంత్రం సుభాష్‌నగర్ రోడ్ నంబర్ 1 మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన ఓ కాలేజీ బస్సు డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వినయ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. వినయ్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ త్రీ టౌన్ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


