జ్యోతినగర్: రా మగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ ఫయా జ్ తయ్యబ్‌ను సింగరేణి ఆర్జీ– 1 జీఎం లలిత్‌కుమార్ శుక్రవా రం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా, పారిశ్రామిక సమన్వయం, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చ జరిగిందా? అనే వివరాలు నిర్ధారణ కావాల్సి ఉంది. ఎన్టీపీసీ, సింగరేణి పారిశ్రామికంగా కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మెడికల్ షాపుల్లో తనిఖీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీలోని పలు మెడికల్ షాపులను టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో శుక్రవారం నార్కోటిక్, డ్రగ్స్ నిరోధక శాఖ, సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ బందాలు ఆకస్మి కంగా తనిఖీ చేశాయి. నియంత్రిత ఔషధాల తోపాటు కోడిన్ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయా ల రికార్డులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, సేల్స్ రిజిస్టర్లను పరిశీలించాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. నియంత్రిత మందుల ను చెల్లుబాటయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా, నిబంధనల ప్రకారమే విక్రయించాలన్నా రు. నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై రమేశ్, ఎస్ఎఫ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
నిరంతరం విద్యుత్ సరఫరా
ధర్మారం/జూలపల్లి: వ్యవసాయ రంగంతోపా టు గృహ వినియోగదారులకు నిరంతర విద్యు త్ సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ గంగాధర్ తెలిపారు. జూలపల్లి మండల కేంద్రంలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ధర్మా రం మండలం కొత్తూరులో సామర్థ్యం పెంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. వి ద్యుత్‌ను వృథా చేయొద్దన్నారు. డీటీఈ బాల య్య, డీఈలు (ఆపరేషన్) రాజబ్రహ్మచారి, శ్రీ నివాస్‌రెడ్డి, ఏఈలు, మునిందర్‌రెడ్డి, హరీశ్, ఎంఆర్టీ ఏఈ రాజమల్లయ్య పాల్గొన్నారు.
కచ్చితత్వంతో జనగణన
పెద్దపల్లి: జిల్లాలో రెండోవిడత జనగణన ప్ర క్రియను పకడ్బందీగా, కచ్చితత్వంతో చేపట్టా లని అదనపు కలెక్టర్ శ్రీరాములు సూచించా రు. రెండోవిడత జనగణనపై కలెక్టరేట్లో వ ర్క్స్, టెక్నికల్ అసిస్టెంట్లకు శుక్రవారం శిక్షణ ఇ చ్చారు. శ్రీరాములు మాట్లాడుతూ, ప్రతీకుటుంబం, ప్రతీ వ్యక్తి వివరాలు పొరపాటులేకుండా నమోదు చేయాలని అన్నారు. కలెక్టరేట్ ఏవో ప్రకాశ్, సీ– సెక్షన్ పర్యవేక్షకుడు కోటేశ్వర్, సెన్సెస్ ట్రైనర్ వర్షిత పాల్గొన్నారు.
బతుకమ్మ సంబురాల్లో మహిళా పోలీసులు
జ్యోతినగర్: విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీపీసీ మ హిళా పోలీసులు బతుకమ్మను పేర్చి వేడుకల కు సిద్ధమయ్యారు. ఎస్ఐ–2 స్రవంతితోపాటు మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
చట్టాలపై అవగాహన అవసరం
పెద్దపల్లిరూరల్: చట్టాలపై ప్రతీఒక్కరికి కనీస అవగాహన అవసరమని జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ అన్నా రు. భోజన్నపేటలో శుక్రవారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. పేద, బలహీనవర్గాలకు ప్రభు త్వం ఉచితంగా న్యాయసేవలు అందిస్తోందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. సర్పంచ్ బండారి త్రివేణి, ఉపసర్పంచ్ అనిల్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


