కోల్సిటీ: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కొత్త భవనాన్ని జనవరి 15వ తేదీ నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలోని నర్సింగ్ కళాశాల భవనా న్ని ఫిబ్రవరి వరకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నగరంలో శుక్రవారం ఆయన పర్యటించారు. 36వ డివిజన్లో జీవో 76 దరఖాస్తుల సర్వేను తనిఖీ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నందున శస్త్రచికిత్సల సంఖ్య పెంచాలని సూచించారు. పే షెంట్లు శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 36వ డివిజన్లో జీవో 76 కింద వచ్చిన దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ధ్రువీకరణ ప్రక్రియను ఈనెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ రమేశ్, ఈఈ రామకృష్ణ, అదనపు డీఆర్డీఏ రవీందర్, డీఈ ప్రభాకర్, ఆర్ఎంవోలు కృపాభాయి, అప్పారావు, రాజు, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసూన పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు


