వేములవాడ: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో మైదానమంతా కోలాహలంగా మా రింది. ఈ పోటీల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ లోచనతో కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మై దానంలోకి అడుగుపెడుతున్న క్రీడాకారులకు నిర్వాహకులు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. బాలికా క్రీడాకారులకు బొట్టు పెట్టి, గులాబీ పూలు అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు.
క్రీడాకారులు, కోచ్‌ల ప్రశంసలు
జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్న కోచ్‌లు, క్రీడాకారులు ఈ స్వాగతాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా క్రీడాకారులకు ఇలాంటి గౌరవం, ఆత్మీయత లభించడం ఇక్కడే చూస్తున్నామని ప్రశంసించారు. ఈ రకమైన స్వాగతం తమలో సరికొత్త ధైర్యాన్ని, క్రీడా ఉత్సాహాన్ని నింపిందని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
బొట్టు పెట్టి, పూలతో క్రీడాకారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను మన సొంత పిల్లలుగా భావించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేములవాడ మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం.
– పుల్కం రాజు–శ్రీలక్ష్మి దంపతులు, వేములవాడ మున్సిపల్ చైర్మన్
అసలైన గౌరవం
ఆటగాళ్లకు గెలుపోటముల కంటే గుర్తింపు, గౌరవం చాలా ముఖ్యం. వేములవాడ గడ్డపై అడుగుపెట్టగానే మాకు లభించిన ఈ స్వాగతం మేము కబడ్డీ ప్లేయర్లుగా మారినందుకు ఎంతో గర్వపడేలా చేసింది. ప్రతీపోటీలోనూ ఇలాంటి సంప్రదాయం వస్తే క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
– వైష్ణవి, సంజన, వరంగల్ జట్టు
స్టేట్ మీట్‌లో నేషనల్ లెవెల్ ఆతిథ్యం
ఆటగాళ్లలో రెట్టింపైన ఉత్సాహం
వేములవాడలో కబడ్డీ సమరానికి ఘన ఆరంభం


