గోదావరిఖని: ప్ర తిభ గల పోలీ సు క్రీడాకారుల ను పోత్సహిస్తా మని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్‌మీట్ లో ప్రతిభ చూపిన సిబ్బందిని శుక్రవారం తన చాంబర్‌లో సీపీ అభినందించా రు. టేబుల్ టెన్నిస్ విభాగంలో 5 కాంస్య పతకాలు సాధించారు. 50 ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏసీపీ ప్రతాప్, డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీ కాంస్య పతకం సాధించింది. 40 ప్లస్ సింగిల్స్‌లో పీసీ ఎం.ఉదయ్ కిరణ్ కాంస్య పతకం సాధించారు. ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ కె.విజయ, కె.దీప జోడీ కాంస్య పతకం సాధించింది. 40ప్లస్ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ ఎం.వనిత, కె.విజయ కాంస్య పతకం, 40ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పీసీ డి.రాజేందర్, డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్ విభాగంలో ఓపెన్ సింగిల్స్‌లో కె. సురేశ్ రజత, ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కె.సురేశ్, కె.విజయ జోడీ కాంస్య పతకం సాధించింది. అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు నాగేంద్రగౌడ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళి అర్పించారు.


