గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన అ లుగువెల్లి ఉభయరెడ్డి ‘నౌ యువర్ లీడర్’ అంశంపై ఢి ల్లీలో ప్రసంగించి ప్రతిభ చా టాడు. జాతీయ నేతల జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం కోసం కేంద్ర క్రీడలు, యువజన శాఖ ఈ కార్యక్రమం నిర్వహించింది. మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి సేవ లు, పాటించిన విలువలపై ఉభయరెడ్డి ప్రసంగించాడు. తెలంగాణ నుంచి ఇతడొక్కడే ప్రాతినిధ్యం వహించడం విశేషం. భారత్ యూత్ పార్లమెంట్–2026లో రాష్ట్రస్థాయిలోనూ ఐదో స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వై.ప్రసాద్, అధ్యాపకులు రవి, అంబిక, రఘుపతి, సుధా, అనిల్, రవీందర్, శ్యాంప్రసాద్, సతీశ్, జ్యోతి, విద్యార్థులు అభినందించారు.
ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన ఉప్పు ముత్యం హైదరాబాద్ ఫొటో ఎక్స్, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ పోటీల్లో అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 99మంది పోటీలకు హాజరవగా.. ముత్యం తీసిన చిత్రాలు అవార్డుకు ఎంపికయ్యాయి. శంషాబాద్‌లో శుక్రవారం ఎంపీ శేఖర్ నుంచి అవార్డు అందుకున్నారు. ఆయనను కొలనూరు గ్రామస్తులు అభినందించారు.
రాజకీయ కక్షతోనే కూల్చివేత
పాలకుర్తి: గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, రాజకీయ కక్షలను కాంగ్రెస్ పెంచిపోషిస్తున్నదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు కోరుకంటి చందర్ ఆరోపించారు. పాలకుర్తిలోని బీఆర్‌ఎస్ జెండా గద్దెను కూల్చివేయ గా.. సంఘటన స్థలాన్ని చందర్ శుక్రవారం ప రిశీలించి మాట్లాడారు. రహదారి విస్తరణ పే రుతో పార్టీ జెండాగద్దెను సర్పంచ్ కూల్చివేయ డం సరికాదన్నారు. జెండా గద్దెను మళ్లీ నిర్మించకపోతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను ముట్టడిస్తామని, ఇందుకు రాజ్‌ఠాకూర్, సర్పంచ్ బా ధ్యత వహించాలని హెచ్చరించారు. నాయకు లు సమ్మయ్యయాదవ్, కొంరయ్య, రాజయ్య, రాజేందర్, శ్యాంకుమార్, శంకర్ పాల్గొన్నారు.


