ఇంటి పెద్దను కోల్పోయి.. బతుకు భారమై | - | Sakshi
Sakshi News home page

ఇంటి పెద్దను కోల్పోయి.. బతుకు భారమై

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

కాల్వశ్రీరాంపూర్‌: అనారోగ్యంతో అనంత లోకాలకు వెళ్లిన భర్త.. శిథిలమైన ఇల్లు.. భవిష్యత్‌పై బెంగతో ఆవేదన వ్యక్తం చేస్తోందని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రానికి చెందిన పిల్లలమర్రి సునీత. ఆమె భర్త పిల్లలమర్రి సదానందం(40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. భార్య సునీత రోజూవారి కూలీ పనులు చేస్తూ తన కూతురు మృదుల(8)ను సాకుతోంది. సదానందం అంత్యక్రియలు, కర్మకాండలకు కులసంఘం నుంచి సాయం అందించారు. ఇటీవల కురిసిన వర్షాలతో గూనపెంకుల ఇంటి గోడలు కూలిపోయాయి. శిథిలమైన ఆ ఇంట్లోనే కూతరుతో కలిసి ఉంటున్న ఆమె.. భయంభయంగా బతుకుతోంది. పాములు, తేళ్లు, పురుగుపుట్రా వస్తున్నాయని కన్నీటిపర్యంతమవుతోంది. నాలుగో తరగతి చదువుతున్న కూతురు చదువు, పొట్టకూటికోసం, ఇంటిని చక్కదిద్దుకునేందుకు చేతిలో చిల్లిగవ్వకూండా లేదని చెబుతోంది. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన నంబరు : 93818 52496.

శిథిలమైన ఇంట్లోనే అభాగ్యురాలి జీవనం

పొట్టకూటికోసం అనేక తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement