ఐస్‌క్రీమ్‌లో పురుగు | - | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌లో పురుగు

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

పెద్దపల్లిరూరల్‌: ఎండలు మండిపోతున్నా యి. అ యితే, శుక్రవారం సెలవుకావడంతో ఇంటివద్ద ఉన్న కూతుళ్ల కోసం స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన బొడ్డుపల్లి సంపత్‌ ఐస్‌క్రీం కొనుగోలు చేశాడు. దానిని చిన్నారులు తింటుండగా పురుగు ప్రత్యక్షమైంది. దాన్నిచూసిన వినియోగదారు సంపత్‌.. ఐస్‌క్రీం పార్లర్‌ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. అధికారులకు సమాచారం అందించినా ఫుడ్‌సేఫ్టీ అధికారి గానీ, మున్సిపల్‌ అధికారులు గానీ అందుబాటులోకి రాలేదని ఆరోపించాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐస్‌క్రీం పార్లర్లను తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఐస్‌క్రీం పార్లర్‌ వద్ద గొడవ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement