జ్యోతినగర్: కాంట్రాక్టు కార్మికులను మెడికల్ టెస్ట్‌ల పేరుతో వేధించడం మానుకోవాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ ఎదుట శనివారం కార్మికులు నిరసన చేపట్టా రు. జేఏసీ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికలను అంగీకరించకుండా ఇబ్బందులకు గురి చే యడం సమంజసం కాదన్నారు. 30 ఏళ్లుగా వి ధులు నిర్వహిస్తున్న కార్మికులను టెస్ట్‌ల పేరు తో అన్‌ఫిట్ చేయడం మానుకోవాలని కోరా రు. ఎన్టీపీసీ ధన్వంతరిలో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రి, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో తీసుకొచ్చిన ఫిట్ మెడికల్ సర్టిఫికెట్లను ఆమోదించేందుకు యా జమాన్యం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై చర్చ అవసరం
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థు లు, యువత, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు చేసిన త్యాగాలు చరిత్రాత్మకమైనవని ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య అన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యమకారుల హక్కులు, నిరుద్యోగ యువత సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో అవసరమై న మార్పులపై దృష్టి సారించాలని కోరారు. టీ పీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం మాట్లాడుతూ ఆదివారం హన్మకొండలో చర్చా వేదిక నిర్వహిస్తున్నామన్నారు. టీపీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు కంపల్లి అంజన్న, కె.రాజు, రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సామాజిక ఉద్యమకారులు రామిల్ల బాపు, లింగయ్య పాల్గొన్నారు.
కళాకారుల వేదిక కార్యవర్గం
పెద్దపల్లి: కళాకారుల వేదిక జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక నందన గా ర్డెన్‌లో రంగస్థల కళాకారుల సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పొన్నం పర్శరాములు, అధ్యక్షుడి గా అటికం రాజేశంగౌడ్, ఉపాధ్యక్షులుగా అట్ల కొమురయ్య, రావుల సదానందం, కొలిపాక స త్తిబాబు, చిప్పకుర్తి అరవిందస్వామి, మ్యా దర వేణి చొక్కయ్య ప్రధాన కార్యదర్శిగా పిడుగు శ్రీనివాస్, కార్యదర్శులుగా గోస్కుల ప్రవీణ్, పల్లికొండ సాగరిక, బొంగోని శంకర్‌గౌడ్, తీగ ల కొమురయ్య, కోశాధికారిగా పెంచాల రాజేశం, కార్యవర్గ సభ్యులుగా కందుల సదయ్య, బరిగెల సతీశ్, మెండె సుధాకర్, బోయిని కొ మురయ్య, కత్తెర్ల రాజయ్య, పూదరి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారని ఎన్నికల నిర్వాహకులు అ బ్బిడి రాంరెడ్డి, కూకట్ల తిరుపతి ప్రకటించారు.
మధ్యవర్తులను నమ్మొద్దు
కోల్‌సిటీ: చేయూత పథకం ద్వారా పింఛన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూ చించారు. అర్హులైన వారికి పారదర్శకంగా పింఛన్లు అందించేందుకు డివిజన్లలో హెల్ప్‌డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అర్హులైన వారు ఈనెల 31వ తేదీ లోగా హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లోనే దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ సూచించారు. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచే పింఛన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఆపరేషన్లు విజయవంతం
పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు శస్త్రచికిత్సలను యూరాలజీ వైద్యనిపుణులు విజయవంతంగా నిర్వహించారు. చందపల్లి గ్రా మానికి చెందిన మహిళ(59) మూత్రవిసర్జన సమయంలో మంట సమస్యతో రాగా, ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, కిడ్నీ పనితీరు దెబ్బతిన్నదని వైద్యులు గుర్తించారు. భవిష్యత్‌లో ఇ తర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకా శం ఉండడంతో దానిని తొలగించారు. ప్రస్తు తం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అ దేవిధంగా నిమ్మనపల్లికి చెందిన మహిళ(46) నెలక్రితం కిడ్నీలో రాళ్లు ఉండటంతో డీజే స్టెంట్ వేశారు. తాజాగా డీజే స్టెంట్ రిమూవల్ ప్ర క్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు శస్త్రచికిత్సల్లో యూరాలజిస్ట్ సంతోష్‌రె డ్డి, జనరల్ సర్జన్‌లు సాయిప్రసాద్, రాము, భవాని, స్వాతి, కృష్ణవేణితో పాటు ఓటీ సిబ్బంది పాల్గొన్నారు. వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు.


