భూమి వారసత్వ పట్టా రద్దు | - | Sakshi
Sakshi News home page

భూమి వారసత్వ పట్టా రద్దు

Aug 23 2026 2:10 AM | Updated on Aug 23 2026 2:10 AM

పాలకుర్తి: బామ్లానాయకతండాలో నకిలీ డె త్‌ సర్టిఫికెట్‌ సృష్టించి ఒకరి భూమిని మరొ కరి పేరిట చేసిన విరాసత్‌ పట్టాను రద్దు చేసినట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు. ఈమేరకు శ నివారం ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. ఆయన క థనం ప్రకారం.. ఇస్లావత్‌ సుజాతకు సర్వే నంబర్‌ 111లో 24గుంటల అ సైన్డ్‌భూమి ఉండగా, అదే గ్రామానికి చెందిన ర త్తు.. సుజాత చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌తో విరా సత్‌ పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డుపై నోటీసు అంటించగా.. అభ్యంతరాలు రాలేదు. దీంతో పట్టా మార్పిడి జరిగింది. తాను బతికే ఉన్నానని, నకిలీ స ర్టిఫికెట్‌తో తన భూమిని కాజేశారని బాధితురాలు సుజాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో ర త్తు తప్పుడు ధ్రువీకరణపత్రం సమర్పించి భూమి కాజేసేందుకు యత్రించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈనేపథ్యంలో రత్తు వారసత్వ పట్టా రద్దు చేయడంతోపాటు సుజాతకు భూమి బదిలీ చేసేందుకు వీలు గా ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీంతోపాటు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలకు సిఫారసు చేశారు. అ యితే, ప్రొసీడింగ్స్‌ను భూయజమాని తీసుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం. బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి భూమిని కాజేయాలని యత్నించిన వారితోపా టు అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

వేగంగా రీ సర్వే పనులు

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పనుల్లో వేగం పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. నిమ్మనపల్లి గ్రామంలో శనివారం రీ సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. రీ సర్వే సమయంలో నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జిల్లా సర్వే అధికారి సోమేశ్వర్‌, తహసీల్దార్‌ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘాటెక్కిన ఉల్లి

పెద్దపల్లి: ఉల్లి, చక్కెర, పూలధరలు అమాంతంగా పెరిగాయి ఉల్లి సామాన్యులను కంటతడి పెట్టిస్తుండగా.. చక్కెర చుక్కలు చూపిస్తోంది. శ్రావణ మా సం సందర్భంగా దేవుళ్లకు సమర్పించే పూలధరలు సైతం భారీగా పెరిగాయి. వారం క్రితం వరకు ఉల్లి గడ్డ కిలో రూ.30 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.50కి, చక్కెర కిలో రూ.40 – రూ.60కి చేరింది. పూలు మూర రూ.25 పలుకగా..ప్రస్తుతం రూ. 65కి చేరింది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

అల్పాహారం ట్రయల్‌ రన్‌

మంథని: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శనివారం ఉచిత అల్పాహార పథకం ట్రయ ల్‌ రన్‌ నిర్వహించారు. జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి కల్పన పరిశీలించారు. విద్యార్థులకు షూస్‌ అందజేశారు. ప్రిన్సిపాల్‌ ఉష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement