పెద్దపల్లి: సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేరు ఓటరు జాబితాలో ఉండేలా కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డుల్లో సర్ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఓటరు జాబితాలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు తావు లేదని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సర్‌పై సమీక్ష
కాల్వశ్రీరాంపూర్: గడువులోగా ‘సర్’ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. స్థానిక తహాహల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఓటర్లు సందేహాల నివృత్తి కోసం పంచాయతీల్లోని హెల్ప్‌డెస్క్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ రాముడు, ఆర్‌ఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


