ఓదెల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గంట రాముల యాదవ్ ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి శుక్రఓవారం ఏసీ బహూకరించారు. స్వామివారి దర్శనం సందర్భంగా ఉక్కపోతతో భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏసీ వితరణ చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు వీరభద్రయ్య, ఆరుట్ల నర్సింహాచార్యులు, సర్పంచులు కనికిరెడ్డి సతీశ్, గ్యారవేని విజయ, జీల రాజు, మద్దెనవేని రవి, ఉపసర్పంచ్ మహేందర్, మాజీ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, నాయకులు పోలోజు రమేశ్, శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.


