సీ్త్ర‘నిధి’.. పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

సీ్త్ర‘నిధి’.. పెన్నిధి

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

పెద్దపల్లి: సీ్త్రనిధి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోంది. వ్యక్తిగత రుణాలతోపాటు వ్యాపారాలు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాలకూ రుణాలు అందిస్తోంది. కూరగాయల సాగు, పాడి గేదెలు, పూలతోటలు, సోలార్‌ రూప్‌టాప్‌, మత్స్యకార్మికులకు ఉపాధి, గృహాల మరమ్మతు, ఎలక్ట్రిక్‌ ఆటోలు, బైక్‌లు, సాధారణ వ్యాపారం, రోజూవారీ ఆదాయం సమకూరే వ్యాపారాలకూ విరివిఆ రుణాలు అందిస్తు న్నారు. వీటితోపాటు పశుపోషణ, చిన్నపరిశ్రమ లు, రెడీమేడ్‌ వస్త్రాల తయారీ, కిరాణాలు, హో టల్‌, టీదుకాణాలు, టైలరింగ్‌, బ్యూటీపార్లర్లు తదితర వ్యాపారాలకు మహిళలు రుణ మొత్తం వెచ్చి స్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.

విరివిగా రుణాలు మంజూరు..

సీ్త్రనిధి పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. సాధారణంగా రూ.5,000 నుంచి రూ.50 వేల వరకు సువిధ, ప్రగతి స్కీం ద్వారా రూ.50 వేల నుంచి రూ.1,50,000, అక్షయ ద్వారా రూ.1,50,000, రూ.3 లక్షలు, సౌభాగ్య స్కీం ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.4,50,000, ఐశ్వర్య పథకం ద్వారా రూ 5,00,000 వరకు రుణాలు అందిస్తున్నారు.

ఏటికేడు పెరుగుతున్న నిధులు

జిల్లావ్యాప్తంగా 1,770 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు), సుమారు 1,78,767 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మంది వ్యాపారాలు నిర్వహిస్తూ సీ్త్రనిధి ద్వారా రుణాలు పొందుతున్నారు. సీ్త్రనిధి ద్వారా 2023–24లో రూ.19.47 కోట్లు, 2024– 2025–లో రూ.44.90 కోట్లు, 2025–26లో రూ.71.80 కోట్లు, 2026–27లో 89 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు రూ.6.25 కోట్లు పంపిణీ చేశారు.

సీ్త్రనిధి స్కీం ద్వారా రుణాలు

సొంతంగా మహిళల వ్యాపారాలు

మరోనలుగరికి ఉపాధి అవకాశాలు

ఆదర్శంగా నిలుస్తున్న స్వయం సహాయ సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement