సీ్త్రనిధి రుణం వచ్చింది. దానితో ఎలక్ట్రిక్ ఆటో కొని ఉపాధి పొందుతున్నాం. అధికారులు రుణం మంజూరు చేయడంతోపాటు వాహనం నడుపుకునేందుకు అన్నిరకాల అనుమతులు ఇప్పించారు. ఆటో నడపడం ద్వారా మంచి ఆదాయమే వస్తున్నది. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా ఉంది.
– గడ్డం స్రవంతి, పెద్దంపేట, అంతర్గాం
డిపాజిట్లు పెంచుకోవాలి
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు సీ్త్రనిధి ద్వారా మరిన్ని రుణాలు పొందాలంటే క్రమం తప్పకుండా డిపాజిట్లు సేకరించాలి. సంఘాల్లో పొదుపు ఇంకా పెరిగాలి. ఇలాఅయితే అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మహిళలు డిపాజిట్లు పెంచడం శ్రేయష్కరం.
– దుర్గాప్రసాద్, ఆర్‌ఎం, సీ్త్రనిధి


