సుల్తానాబాద్‌రూరల్: పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని డీసీపీ రాంరెడ్డి సూచించా రు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం డీసీపీ తనిఖీ చేశారు. గ్రేవ్ కేసులు, విచారణ కేసులు, పెండింగ్ ట్రయల్స్ ఫైళ్లు పరిశీలించారు. ప్రజల్లో పోలీస్‌శాఖపై విశ్వాసం పెరిగేలా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్‌రెడ్డి, మల్లేశ్, సనత్, మధుకర్, సుధాకర్ పాల్గొన్నారు.
సమర్థవంతంగా విధులు
కమాన్‌పూర్: పోలీసులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఏసీపీ తనిఖీ చేశారు. కేసుల వివరాల గురించి ఎస్సై ప్రసాద్‌ను అడిగి తెలుసుకొన్నారు. బాధితులనుంచి ఫిర్యాదులు స్వీకరించి తక్షణ పరిష్కార మార్గం చూపాలని సూ చించారు. గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు, స్టేషన్ రైటర్ శ్రీనాథ్ ఉన్నారు.
31వరకు రైల్వేగేట్ మూసివేత
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: పెద్దపల్లి–కూనారం మధ్యలోని రైల్వే లెవల్ క్రాసింగ్ గేటును శనివా రం (ఈ నెల 25) నుంచి ఈనెల 31 వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల కో సం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మా ర్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాచా రం అందించాలన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఈనెల 31 రాత్రి 7గంటల వరకు గేట్‌ను మూసిఉంచుతామని, ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
హెచ్‌పీవీ టీకా కీలకం
కోల్‌సిటీ: సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలకపాత్ర పోషిస్తుందని డీఎంహెచ్‌వో పవిత్ర అన్నారు. గోదావరిఖని అడ్డగుంటపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థినులకు శుక్రవారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేశారు. డీఎంహెచ్‌వో ఈ ప్రక్రియ పరిశీలించి మాట్లాడారు. చిన్న వయసులోనే టీకా తీసుకుంటే భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, ప్రోగ్రామ్ అధికారి కిరణ్, అకౌంటెంట్ సౌమ్య, వైద్యాధికారి స్నేహలత, కమ్యూనిటీ ఆర్గనైజర్ అనిత, నర్సింగ్ ఆఫీసర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
ఫెర్టిలైజర్‌సిటీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘ నంగా నిర్వహించారు. స్థానిక ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కో రుకంటి చందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, నాయకులు దామోదర్‌రావు, మూల విజయారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి, నాయకులు మారుతి నారాయణదాసు పాల్గొన్నారు.
30న జాబ్‌మేళా
పెద్దపల్లి: స్థానిక టాస్క్ సెంటర్‌లో ఈనెల 30వ తేదీన ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం మేళా నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు హాజరు కావాలని ఆయన సూచించారు.


