కదిలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

కదిలిన యంత్రాంగం

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

ఈనెల 23న ‘సాక్షి’ ప్రచురించిన కథనం

వినియోగంలోకి వచ్చిన ఫాగింగ్‌ యంత్రాలు

నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్న శానిటేషన్‌ సూపర్‌వైజర్‌

కోల్‌సిటీ: రామగుండం నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దోమలపై మొద్దునిద్రలో ఉన్న అధికారులను ‘సాక్షి’ తట్టిలేపింది. ఈనెల 23న ‘దోమల దండయాత్ర’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. మేయర్‌ మహంకాళి స్వామి స్పందించారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో బల్దియా యంత్రాంగం స్పందించింది. మూలనపడేసిన ఫాగింగ్‌ యంత్రాలను శుక్రవారం మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు. వినియోగంలో లేని ఫాగింగ్‌ యంత్రాలను రంగంలోకి దింపారు. డివిజన్లలో ఫాగింగ్‌ను ముమ్మరం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో లార్వా నిర్మూలన కోసం ఆయిల్‌ బాల్స్‌ వేయించారు. దోమల నివారణకు ‘సాక్షి’ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందించారు.

దోమలపై యుద్ధానికి బల్దియా శ్రీకారం

మేయర్‌ సూచనలతో రామగుండంలో ప్రారంభమైన ఫాగింగ్‌

నిల్వనీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్న పారిశుధ్య సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement