గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంత ప్రజలు, గుండెపోటు బాధితుల కోసమే సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేశారని రామగుండం మేయర్ మహకాంళి స్వామి అన్నారు. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండెపోటు బాధితులు కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు తరలించేలోపే చనిపోతున్నారని, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చొరవతో ఇక్కడే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసేలా చూశారని అన్నారు. త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, సింగరేణి ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, డీవైసీఎంవో ప్రసన్నకుమార్, సింగరేణి శ్రీనివాస్, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కనిపించడం లేదా?
నగరంలో రూ.600 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ నాయకులకు కనిపించం లేదా అని మేయర్ మహంకాళి స్వామి ప్రశ్నించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పదవీకాలంలో చేసిన ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఆయన హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించడానికి సిద్ధమైతే చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు ముస్తఫా, అడ్డాల గట్టయ్య, తౌటం సతీశ్, కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, బొమ్మక రాజేశ్, దాసరి విజయ్, కల్యాణి సింహాచలం, చెరుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం మేయర్ మహంకాళి స్వామి


