పెద్దపల్లి: నీట్ పరీక్షలు నష్టపోయే విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, వా మపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో కళాశాలల బంద్ నిర్వహించారు. పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, లాఠీచార్జీ వంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి అరవింద్, నా యకులు గంప నరేశ్, రాజ్‌కుమార్, బాలాజీ, అభిలాష్, నవీన్, రాజు, అనిల్, రాహుల్ పాల్గొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
మంథని: పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థ లు మూతపడ్డాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ ఆ ధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ ఇన్‌చార్జి కె క్కర్ల సందీప్ మాట్లాడుతూ, నీట్ పరీక్షల్లో లోపా లు, పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చే శారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ నూకల కమల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మద్ద తు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు అఖిల్, మహేందర్, రణధీర్ తదితర నాయకులు, విద్యార్థులు ఉన్నారు.


