ఈఎస్‌ఐ, ఎయిర్‌పోర్టుపై కేంద్రం రాజకీయం | - | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ, ఎయిర్‌పోర్టుపై కేంద్రం రాజకీయం

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని: రామగుండంలో ఈఎస్‌ఐ, ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం రాజకీయం చే స్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రూ. 450 కోట్ల సెమికండక్టర్‌ పరిశ్రమను ఆంధ్రాకు తరలించారని ఆరోపించారు. ఫిజిబులిటీ రిపోర్టు వచ్చి నా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయకుండా ఆదిలాబాద్‌ తరలించేలా కుట్ర చేస్తున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తాను ఒకే ఫ్లైట్‌లో వచ్చినా తాడిచర్ల–2 సింగరేణికి కేటాయించిన విషయాన్ని తనకు చెప్పలేదన్నారు. అయోధ్యలో రూ.250 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ జరిగితే ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మంత్రులు నీట్‌ పరీక్షపత్రాలు అమ్ముకొంటున్నారన్నారు. నాయకులు కుమారస్వామి, మల్లికార్జున్‌ ఉన్నారు.

భూగర్భ వంతెనలు నిర్మించాలి

రామగుండం: రామగుండం నుంచి గోదావరిఖని బొగ్గు గనుల వరకు ఉన్న రైల్వేలైన్‌ మధ్యలోని మల్యాలపల్లి, బద్రిపల్లి రూట్‌లో భూగర్భ వంతెనాలు నిర్మించాలని డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్‌.. గోదావరిఖని పర్యటనకు వచ్చిన ఎంపీ వంశీకృష్ణకు విన్నవించారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement