రిజిస్ట్రేషన్ కార్యాలయం కిటకిట ● చార్జీల సవరణతో భూముల రిజిస్ట్రేషన్ ● గతనెల ఐదునుంచి అమలులోకి రామగుండం: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువ గతనెల ఐదోతేదీ నుంచి అమలులోకి వచ్చింది. గతం విలువతో పోల్చితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలు, ఏరియాల ప్రాతిపదికన డిమాండ్‌ను అనుసరించి ఆస్తుల విలువలు పెంచారు. ఈ నేపథ్యంలో రామగుండంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం క్రయ, విక్రయదారులతో రద్దీగా మారుతోంది.
● చార్జీల సవరణతో భూముల రిజిస్ట్రేషన్ ● గతనెల ఐదునుంచి అమలులోకి
స్లాబ్ గతం ప్రస్తుతం
మొదటి 4,100 6,200
రెండో 5,800 8,700
మూడో 11,500 17,300
నాలుగో 15,200 22,800
కమర్షియల్ పరిధిలో..
మొదటి 26,400 39,600
రెండో 33,000 49,700
మూడో 29,900 44,900
గ్రామ పంచాయతీ
మొదటి 700 1,300