గోదావరిఖనిటౌన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యా ల కల్పన లక్ష్యంగా బస్టాండ్ ఆధునికీక రణ చేపట్టామని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రా జ్‌ఠాకూర్ అన్నా రు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆ యన పరిశీలించారు. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్స్, ప్రత్యేక ఆటోస్టాండ్, డ్రైవర్లకు సౌకర్యాల కల్పన, ఫుట్‌ఫాత్‌లు, శుభ్రమైన తాగునీరు, పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు తదిరతులు పాల్గొన్నారు.
డాక్టర్లను నియమించకుంటే నిరాహార దీక్ష
మంథని: పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యులను నియమించకుంటే నిరాహార దీక్ష చేపడతా మని మంథని ము న్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ హెచ్చరించారు. స్థానిక మాతాశిశు ఆస్పత్రిలో డాక్టర్లను నియమించాలనే డిమాండ్‌తో ఆస్పత్రి ఎదుట శనివా రం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. నాటి సీఎం కేసీఆర్ మాతాశిశు ఆస్పత్రుల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నాయకులు కే దారి గీత, ఎగోలపు కమల, తగరం సుమలత, మాధారవేణి శారదా, భాగ్యలక్ష్మి, స్వప్న, ప్రేమలత, సుజాత, సౌజన్యరెడ్డి, శ్రీలక్ష్మీచౌదరి పాల్గొన్నారు.


