నిబంధనలకు లోబడే నడుపుతున్నాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు లోబడే నడుపుతున్నాం

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: తాము ఇటుకల వ్యాపా రం చేసుకుంటున్నామని, అందుకు అవసరమైన ముడిసరుకులను నిబంధనలకు లోబడే తీసుకుంటున్నామని, అయినా తమపై మట్టిమాఫియా అని నిందారోపణలు చేయడం తగదని ఇటుకబట్టీ య జమానులు శ్యాం, ఆనందరావు, ఆడెపు వెంకటేశం, లక్ష్మణ్‌రావు, జాఫర్‌, సిద్దయ్య, కొండయ్య, ప్ర దీ ప్‌, అవినాష్‌ తదితరులు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటుకల వ్యా పారంలో అన్నిరాజకీయ పార్టీలకు సంబంధించినవారు ఉన్నారని, వారి రాజకీయాల తో వ్యాపారా నికి సంబంధం లేదన్నారు. గతంలో క్యూబిక్‌ మీటర్‌కు రూ.42.85 ఉంటే ఇప్పుడు 12 టైర్ల టిప్పర్‌కు రూ.3,200 చెల్లించి కలెక్టర్‌ నుంచి అనుమతి పొందామని తెలిపారు. తాము అధికారు లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకు డబ్బులు ఇస్తున్నట్టు కొందరు దుష్ప్రచారం సాగిస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలని కోరా రు. యజమానులు సుధాకర్‌, వెంకటేశ్వర్లు, సాగర్‌రావు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

వ్యాపారుల ప్రెస్‌మీట్‌.. అధికారుల సైలెంట్‌!

జిల్లాలో కొద్దిరోజులుగా సాగుతున్న మట్టి దందాపై పత్రికల్లో వస్తున్న కథనాలపై వ్యాపారులు ప్రెస్‌మీ ట్‌ నిర్వహించడం చర్చనీయాంశమైంది. వాస్తవాని కి మట్టి దందా కథనాలపై అధికారులు స్పందించాలి. తనిఖీలు చేయాలి. ముఖ్యంగా ఇరిగేషన్‌, రెవె న్యూ, ఆర్టీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ రవాణాపై తనిఖీలు చేయాలి. అక్రమాలకు తావులేకుండా తాము తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలి. అందుకు విరుద్ధంగా ఇటుకబట్టీ యజమానులు ప్రెస్‌మీట్‌ పెట్టి అక్రమాలకు పాల్పడటం లేదని, అధికారులు సక్రమంగానే పనిచేస్తున్నారని ప్రకటించడం ప్రజల్లో చర్చకు దారితీసింది.

ఇటుకబట్టీ యజమానుల స్పష్టీకరణ

Advertisement
 
Advertisement
Advertisement