నూకలు.. తుట్టెలు | - | Sakshi
Sakshi News home page

నూకలు.. తుట్టెలు

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

సన్నబియ్యంలో 25శాతానికి పైగా నాసిరకమే జిల్లాలో ప్రతినెలా 4వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా రేషన్‌ బియ్యంపై పెదవి విరుస్తున్న లబ్ధిదారులు

సాక్షి పెద్దపల్లి: పేదోడు కూడా ఉన్నోడిలా సన్న బియ్యం బువ్వ తినాలని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం సరఫరా చేస్తుంది. అంతే కాకుండా అర్హులైన వారందరికి కొత్తరేషన్‌ రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి పేదలతో పాటు అందరూ రేషన్‌ బియ్యం తినడం అలవాటు చేసుకున్నారు. కానీ, రేషన్‌ బియ్యంలో ఇప్పుడు నూకలు, దొడ్డు బియ్యం కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఆయా రేషన్‌ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రేషన్‌ దుకాణాల్లో 25 శాతానికి మించి నూకలు, 5 శాతం వరకు దొడ్డు బియ్యం ఉంటున్నాయని, వండితే అన్నం ముద్దగా అవుతుందని మహిళలు వాపోతున్నారు. రేషన్‌ డీలర్లను ఇదే విషయం అడిగితే తమకు గోదాముల నుంచి వచ్చినవే ఇస్తున్నామని చెబుతున్నారు. గత నెలలోనూ ఇలాగే వచ్చినా పట్టించుకోలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలా మంది దొడ్డు రేషన్‌ బియ్యం తినలేక, ఎక్కువ ధరకు బయటి మార్కెట్లలో తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

మిల్లులోనే కల్తీ జరుగుతుందా?

జిల్లాలో 2,23,553 రేషన్‌ కార్డులుండగా, ప్రతినెలా 4,000మెట్రిక్‌ టన్నుల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. సీఎంఆర్‌ ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు ధాన్యం మరాడించేటప్పుడు 20శాతం నూకలు కటింగ్‌ బియ్యం వస్తాయనేది బహిరంగ రహస్యమే. వాటికి బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నందున మిల్లు యజమానులు ప్రభుత్వానికి సరఫరా చేస్తుంటారని, వాటిని పరీక్షించాల్సిన అధికారులు మిల్లర్లు ఇచ్చే మాముళ్లను తీసుకొని ఎలాంటి పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో సన్న బియ్యంలో నూకలు, దొడ్డు బియ్యం కలుపుతున్నరానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై డీఎస్‌వో శ్రీనా థ్‌ను వివరణ కోరగా.. ‘రేషన్‌ బియ్యంలో నూకలు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు. దుకాణాలను పరిశీలించి నూకలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటాం. దుకాణాల్లో పరిశీలించి నూకలుంటే ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొని బాధ్యులపై చర్యలకు ముందుకెళ్తాం. మరోసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని తెలిపారు.

జిల్లాలో

లబ్ధిదారులు

6,66,912

ప్రతినెలా బియ్యం సరఫరా 4,000 మెట్రిక్‌ టన్నులు

రేషన్‌ దుకాణాలు

413

రేషన్‌కార్డులు

2,23,553

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement