సమస్యల పరిష్కారం కోసం సమ్మె | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోసం సమ్మె

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

● సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్‌

గోదావరిఖని(రామగుండం): సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారం కోసం సమ్మైకె నా వెనకాడబోమని అధికారుల సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్‌ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఇల్లెందు క్లబ్‌లో మాట్లాడారు. ఈనెల 16న సమ్మె నోటీసు ఇస్తామన్నాని 31లోపు ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని పేర్కొన్నారు. కోలిండియా మాదిరిగా జీతభత్యాలు, ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రతిభ ఆధారంగా చెల్లింపులు పెండింగ్‌లో ఉండడంతో అధికారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. అధికారుల పిల్లలకు ఐఐటీ, ఐఐఎం ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలన్నారు. క్రమశిక్షణ చర్యల పక్రియ సరైన పద్ధతిలో జరగడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఆందోళన చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు రిలేనిరాహార దీక్షలు వాయిదావేసుకున్నామని, ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్‌, కోశాధికారి ఇ.నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement