త్యాగం, సహనానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగం, సహనానికి ప్రతీక రంజాన్‌

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

● ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని(రామగుండం): త్యాగం, కరుణ, సహనానికి రంజాన్‌ ప్రతీక అని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అన్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆదివారం పాత మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో దావత్‌–ఇ–ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో రంజాన్‌ మాసం శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫైవింక్లయిన్‌ కబరస్తాన్‌ కాంపౌండ్‌ వాల్‌ నిర్మించామని, రామగుండంలో రూ.కోటిన్నరతో షాధీఖానా నిర్మించేందుకు బడ్జెట్‌ మంజూరు అయ్యిందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, ముస్తఫా, ఫజల్‌, బాబుమియా, ఆసిఫ్‌, ఫయాజ్‌, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి అఫ్సిన్‌, ఎండీ ఆసిన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement