పెద్దపల్లి: 2029 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహాభియాన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు. హిందూ బంధువులను ఐక్యం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి శిక్షణకు హాజరైన వారికి వివిధ రకాల సామగ్రి అందజేశారు. మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి రాజమౌళిగౌడ్, కన్వీనర్ గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


