ప్రభుత్వం మంచి ఆలోచనతో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో సన్నబియ్యంలో ఎక్కువ శాతం నూకలే వస్తున్నాయి. వాటిని వండితే ముద్దగా మారుతుంది. అధికారులు ఇప్పటికై న నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
– మూడ రాజమ్మ, రామగుండం
నూకలే ఎక్కువ వస్తున్నాయి
రేషన్ షాపులో ఇచ్చే సన్న బియ్యంలో 75 శాతానికి పైగా నూకలు, తుట్టేలు వస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ, నిర్లక్ష్యంతోనే ప్రతి నెలా సన్నబియ్యంలో నూకలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూకలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది.
– బానోతు శివశంకర్, రామగుండం


